రామ్ చరణ్ తన తాజా చిత్రంలో
పవన్ కళ్యాణ్ పాటను రీమిక్స్ చేసి వాడుకోనున్నారని సమాచారం. రామ్ చరణ్ తాజా
చిత్రం గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో ఖుషీ సినిమాలోని ఆడువారి మాటలు
అర్దాలు వేరులే పాటను రీమిక్స్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు
తెలుస్తోంది. కాజల్, రామ్ చరణ్ పై ఈ పాటను చిత్రీకరించనున్నారని
తెలుస్తోంది. అయితే ఆ పాట మిస్సమ్మ చిత్రంలోది పవన్ వాడుకున్న విషయం
తెలిసిందే.
ఇక రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టైటిల్
'గోవిందుడు అందరివాడేలే' . ఈ టైటిల్ గతంలో చిరంజీవి చిత్రం అందరివాడులోని
టైటిల్ సాంగ్ నుంచి తీసుకున్నది కావటం విశేషం. కాజల్ హీరోయిన్. కృష్ణవంశీ
దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై
పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి
షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరింది.
రామ్ చరణ్ కి...: పవన్ వద్దు...ఆయన పాట కావాలి
నిర్మాత మాట్లాడుతూ ''తెలుగుదనం ఉట్టిపడే కథ కథనాలతో తెరకెక్కుతున్న
చిత్రమిది. ఇటీవలే కన్యాకుమారి, పొల్లాచ్చి, రామేశ్వరంలో కీలక సన్నివేశాలు
తెరకెక్కించాం. రామోజీఫిల్మ్‌సిటీలో కొంతభాగం తెరకెక్కిస్తాం. విదేశాల్లో
పాటల్ని చిత్రీకరిస్తాం. రామ్‌చరణ్, రాజ్‌కిరణ్, శ్రీకాంత్‌ల మధ్య
తెరకెక్కించిన సన్నివేశాలు.. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొనేలా ఉన్నాయి''
అన్నారు.
చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ
టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్. తాత, మనవడుగా రాజ్‌కిరణ్, చరణ్‌ల
నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల
ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్
పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ
కనిపిస్తాడు.
ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర
పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో
నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు
నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత:
బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.
No comments:
Post a Comment